User:Bathukammasambaralu
http://bathukammasambaralu.org/
లంగాణా రాష్ట్ర ప్రజల సాంస్కృతిక ప్రతీకగా ‘బతుకమ్మ’ జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. దసరా పండుగకు రెండురోజుల ముందు ఈ బతుకమ్మ జాతరను నిర్వహించుకుంటారు. ఈ పండుగ చాలావరకు సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలలో జరుపబడతాయి. అదేవిధంగా దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఈ రెండు పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందులో బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ వాళ్లకు మాత్రమే చాలా ప్రత్యేకమైంది. ఈ పండుగ శీతాకాలంలో తొలిరోజులలో రావడం వల్ల వాతావరణం పూలతో, నీటితో కొలువై వుంటుంది. అలాగే రకరకాల పండ్లు, పూలు కూడా ఈ కాలంలోనే చాలావరకు వీస్తాయి. ముఖ్యంగా ఇందులో బంతి, చేమంతి, వర్ధనం లాంటి చాలా ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ఈ రంగురంగుల పువ్వులతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ జాతరకు సంబంధించి కొన్ని పురాన కథనాలు కూడా వున్నాయి.
విజయదశమి
[edit]- ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులు అని అంటారు. ఈ 9 రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి హిందువులు అత్యంత భక్తి శ్ర్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుక నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. నవరత్రుల సమయంలో అమ్మవారి అలంకారములు : మొదటి రోజు — బాలా త్రిపుర సుందరి దేవి రెండవ రోజు — గాయత్రి దేవి మూడవ రోజు — అన్నపూర్ణా దేవి నాలుగవ రోజు — లలితా త్రిపుర సుందరి దేవి అయిదవ రోజు — సరస్వతి దేవి ( మూల నక్షత్రం వచ్చినప్పుడు ) ఆరవ రోజు — మహాలక్ష్మి దేవి ఏడవ రోజు — దుర్గా దేవి ఎనిమిదవ రోజు — మహిషాసురమర్దిని దేవి తొమ్మిదవ రోజు — రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా దశమి తిధి నాడు విజయదశమిగా జరుపుకొంటారు.ఈ విజయదశమికి ఉత్తరాది వారు రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు. పాండవులు 12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో తమ ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి, తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు. కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజ ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.See More........http://bathukammasambaralu.org/348-2/
దీపావళి
[edit]- హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు…సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది టపాకాయలు. చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం, మతం అనే బేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ ఒక్క దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది(అక్టోబరు). మొదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి. జ్ఞానానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ, మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస… దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి – రాముడు 14 ఏళ్ల వనవాసం తరవాత రావణుడిని చంపి ఆయోధ్యకు తిరిగి వస్తాడు. రాముడు రావణుడిని చంపిన రోజుని దీపావళిగా జరుపుకుంటారు. ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి.. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి ‘చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్” అని ధ్యానించి.. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం. మరి మహీళలూ దీపాలంకృతంకి తయారుగా ఉన్నారా……See More.....http://bathukammasambaralu.org/దీపావళి