Jump to content

User talk:Drgvlal

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

డా. జి. వెంకట లాల్

తెలుగు ఉపన్యాసకులు

జననం: 12/06/1977 జన్మస్థలం: పెద్ద కిష్టాపురం, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తండ్రి కీ.శే!! బాల్య (లేటు), తల్లి శ్రీమతి తులసి. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఉన్న కొంత వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులు చేేేేసుకుంటూ కష్టపడి చదివారు. డిగ్రీ కళాశాల ఉపన్యాసకులుగా ఉద్యోగం సాధించి, ఎంతోమంది విద్యార్ధులను ఉన్నత స్థానాలకు చేర్చి, చాలామంది విద్యార్దులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

విద్యాభ్యాసం: ప్రాధమిక విద్య స్వగ్రామంలో పెద్ద కిష్టాపురంలోని ప్రాధమిక పాఠశాలలో, ఉన్నత విద్య గార్ల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసారు. ఇంటర్ బయ్యారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఖమ్మంలోని సిద్ధారెడ్డి కళాశాలలో పూర్తి చేసారు. తరువాత యం.ఏ. (తెలుగు), యం.ఫిల్. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పూర్తి చేసారు. పిహెచ్.డి.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరులో పూర్తి చేసారు.

ఉద్యోగం: 1. వి.యస్.ఆర్ & యన్. వి. ఆర్. కళాశాల, తెనాలిలో 2002 నవంబరు నుండి తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. 2. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం లో 10 సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. 3. సాంఘిక సంక్షేమ పాఠశాల, జనగామలో కాంట్రాక్టు తెలుగు అధ్యాపకులుగా రెండు సంవత్సరాలు పనిచేసారు.

రచనలు : I. పుస్తకాలు: 1.తెలుగు వ్యాకరణం, 2. తెలుగు నవలల్లో లంబాడీల జీవన చిత్రణ, 3. కొర్రపాటి గంగాధర రావు నవలానుశీలన, 4. ఖమ్మం జిల్లా బంజారా పండుగలు, 5. అడవి పక్షి ఆలాపన (కవిత సంపుటి), 6. కర్త కాదు క్రియ (కవిత సంపుటి).

II.పరిశోధన పత్రాలు: అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో 40 కి పైగా వ్యాసాలు ప్రచురించబడ్డాయి.అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో 50 కి పైగా పత్రాలు సమర్పించారు.

III. అవార్డులు: 20 కి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. వాటిలో కొన్ని 1. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 2013 లో అందుకున్నారు. 2. ఉత్తమ జాతీయ సేవా అధికారి అవార్డు, అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 2011లో అందుకున్నారు. 3. ఉత్తమ రక్తదాన శిబిర నిర్వాహక అవార్డు, ఉత్తమ మాస్టర్ ట్రయినింగ్ అధికారి అవార్డు, ఉత్తమ సాంస్కృతిక శాఖ కన్వీనర్ గా ఖమ్మం జిల్లా కలెక్టర్లల చేతుల మీదుగా అందుకున్నారు.

4. గురు బ్రహ్మ జాతీయ అవార్డు , ఆచార్య దేవో భవ జాతీయ అవార్డు, ఆణిముత్యం జాతీయ అవార్డు, సేవా జ్యోతి జాతీయ అవార్డు, విద్యా విశిష్ట జాతీయ అవార్డు, విద్యా భూషణ్ జాతీయ అవార్డు, విద్యా తేజ జాతీయ అవార్డు మొదలైనవి స్వచ్చంధ సంస్థలైనటువంటి మధర్ తెరిస్సా, ప్రియదర్శిని, విన్నర్స్, బాపూజీ, ఆరాధన సంస్థలచే అందుకున్నారు.

5. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ టీచరు అవార్డు రెండు సార్లు 2017, 2018 సంవత్సరాలలో యం.వి.యల్.ఏ ట్రస్టు, ముంబాయి వారిచే అందుకున్నారు.

6. పద్మ అవార్డు 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వంచే అందుకున్నారు.

Start a discussion with Drgvlal

Start a discussion