Jump to content

User:Srikadimallesh

From Wikipedia, the free encyclopedia
                               ఈయన తెలుగురాష్ట్రము అయినటువంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రములో, తూర్పుగోదావరి జిల్లాలోని, అప్పనపల్లి గ్రామములో,శ్రీ బాల బాలాజీ స్వామి వారి సన్నిధికి అతిదగ్గరలో, 1973 వ సంవత్సరములో అక్టోబర్  13 వ తేదిన శ్రీ పిచ్చిక చినకనకం మరియు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి ఇంట, తూర్పుగోదావరి జిల్లాలోని, అమలాపురము దగ్గర గల, విలసవిల్లి గ్రామవాసులు అయినటువంటి "కడి" వారి వారసుడుగా జన్మిచినారు. ప్రాధమిక నామధేయము "లీలా రామ లింగ మల్లేశ్వరరావు" గా పెద్దలు నిర్ణయము చేసినప్పటికీ కాలక్రమములో తాత గారి పేరు "కడి మల్లన్న" అగుట వలన "కడి మల్లేశ్వరరావు" గా ప్రాచుర్యము పొందినది. దేవాంగ కులములో, చేనేత కార్మికుల ఇంట, ఈయన జననము చాలా సాధారణము, దిగువ మధ్యతరగతి వారిగా జరిగినది. ఈయన తండ్రిగారు అయినటువంటి శ్రీ "కడి సత్యనారాయణ" గారు అప్పటికి "sslc" విద్యను అబ్యసించినారు. ఈయన చిన్నతనములో తండ్రిగారి ఉద్యోగధర్మము కారణముగా ప్రకాశము జిల్లాలోని, నీటిపారుదల శాఖలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగము చేసినారు. అప్పట్లో 1973 నుండి సుమారు 1979 వరకూ సాధారణ ఉద్యోగిగా జీవనము సాగించినారు. వారి తండ్రి గారికి శ్రీ సత్యనారాయణ గారు ఏకైక పుత్రుడు, దూర ప్రాంతములో ఉద్యోగము చేయుట, పుత్రుని దూరముగా యుంచుట ఇష్టములేక, అప్పుడు చేయుచున్న ఉద్యోగమును, దగ్గరుండి రాజీనామా చేయించి, సొంత ఊరు అయినటువంటి విలసవిల్లి గ్రామములో చేనేత వృత్తి లోనే, తనతో పాటు ఉండవలసినది గా అజ్ఞాపించినారు. దానితో చేసేది లేక తండ్రి ఆజ్ఞను పాటించి సొంత ఊరు కు చేరి అతి సాధారణ జీవనము అయిన చేనేత వృత్తిని చేయుచూ జీవనము సాగించినారు.