Jump to content

User:SRI KSHATRIYA RAMAJOGI

From Wikipedia, the free encyclopedia
                                శ్రీ క్షత్రియ రామజోగి  (రామజోగి/రామజోగుల)  వారి ఆచార-సంప్రదాయ జీవన పద్ధతులు

      సమాజిక సేవ మార్గములో సంచార జీవనమును కొనసాగించిన సంచార కులాలలో (Nomadic Tribes)  శ్రీ  క్షత్రియ రామజోగి కులానికి ప్రత్యేక స్థానం ఉన్నది సమాజములో “శ్రీ  క్షత్రియ రామజోగి” కులానికి చెందిన వారిని “రామజోగి” లేదా “రామజోగుల” “శ్రీ క్షత్రియ రామజోగి” అనే పూర్తి పేరుతో పిలుస్తారు. వీరిని రామజోగి/రామజోగుల కులం వారు అని పిలిచినప్పటికి వీరు క్షత్రియ రాముని వర్గ సేవికులుగా (శ్రీ క్షత్రియ రామజోగి) పిలువ బడుతున్నారు. సంచార జీవనములో బాగంగా పురాణం ఇతిహాసాలని గేయాల రూపకంగా కీర్తనల రూపకంగా వచన కథల రూపకంగా సమాజానికి తెలియజేస్తూ వృత్తి పరంగా ఆయుర్వేదిక చెట్ల పసరికల ద్వార వివిధ వ్యాదులని నయం చేయడం లో సిద్ద హస్తులు. రామజోగులు ప్రదానంగా మానసికమైన  శారీరక వ్యాదులకి, మానసికమైన వ్యాదులని నయం చేస్తారు. శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) కులానికి చెందిన వారు ప్రదానంగా కరీంనగర్,వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డిహైదరాబాద్, జిల్లాల్లో జీవిస్తున్నారు.
       రామజోగి శారీరక సంబందిత వ్యాదులకి వైద్యం :   ఎవరైనా వ్యక్తికి గాయాలు కానీ శారీరక అవస్థలు, కడుపు నొప్పి, నడుము నొప్పి, కీళ్ళనొప్పులు, వంటి వాటిని చెట్ల పసరికల ద్వార నయం చేయబడుతుంది.    

రామజోగి మానసిక సంబందిత వ్యాదులకి వైద్యం: ఎవరైనా వ్యక్తికీ మానసికమైన వ్యాదులు సంభవిస్తే రామజోగి తన వద్ద ఉన్న చెట్ల పసరికల ద్వారానే కాకుండా నీతి కథలద్వారా, పురాణ ఇతిహాసాల నీతి కథల ద్వార, వివిధ చరిత్రల ద్వార, నీతి కథలతో బోదనలు చేసి వారికీ ఆ కథల ద్వార నీతి పధ్యాల-తాత్పర్యాల నుండి నీతిని గ్రహి౦పచేసి మానసికంగా వ్యాదిగ్రస్తుని ఆలోచనలని మానసిక ప్రశాంతత వైపు, ఉన్నతంగా ఆలోచించే విదంగా తాయారు చేస్తారు.


           రామజోగి వైద్యం అనేది సూర్యోదయం కంటే ముందే ప్రారంభమగుతుంది. ఎందుకంటె వ్యాది గ్రస్తులకి చెట్ల పసరికలని (ఉదయమే) పరిగడుపుననే కొన్ని వ్యాదులకి  ఇవ్వవలసి ఉంటుంది. రామజోగి వ్యాదిగ్రస్తులని నయం చేసే నిమిత్తం వివిధ గ్రామాలని సంచారం చేస్తూ సూర్యోదయం కంటే ముందే సుదీర్గ ప్రయాణం చేస్తూ ఉండేవారు. ప్రదానంగా  రామజోగి వైద్యుడు “తెల్లని రుమాలు”, “తెల్లని చొక్కా”, “తెల్లని పంచ”, “పొడుగు నామము”, “తలలో శిఖ”, “పొడవాటి గడ్డం”, (పొడుగు బొట్టు-తిరునామాల బొట్టు)  దరించి చేతికి “జోలె” (చెట్ల పసరికలు కలిగిన సంచి) కలిగి ఉంటాడు. రామజోగి దగ్గర ప్రధానంగా రామజోగి వైద్యం లో భాగంగా రామజోగి దగ్గర శారీరక వైద్యం కొరకు “చెట్ల మూలికలు”, “చెట్ల యేర్లు”, జ్యోతిష్య సంభదిత “తాళ్ళాపత్ర గ్రంధాలు”, మానసికమైన వైద్యంలో భాగంగా “తాంబుర్ర”, దైవస్మరణ చేయుటకు “గజ్జెల-ఛిరుతలు”, “శివున్నీ” మరియు శివ అవతారాలని ఆరాధన చేయుటకు “డమరుకము”, “విష్ణు” అవతారాలను అరాధన చేయుటకు “ఘంట” లను కలిగి ఉంటారు. 


           శారీరక పరమైన  లేక మానసిక పరమైన వ్యాదుల నుండి బాధపడేవారు (రోగులు)  ముందుగ తన వ్యాదులని త్వరగా తగ్గించమని దేవున్ని ప్రార్థన చేస్తారు. తరువాతనే వైద్యులను సంప్రదిస్తారు. అదేవిదంగా రామజోగి శారీరక ,మానసిక వైద్యంలో చెట్ల పసరికలని రోగులకి ఇచ్చె ముందు రామజోగి సైతం చెట్ల యేర్లు ఆకు బెరడులతో తయారు చేసిన పసరికలని దేవుని ప్రతిమల ముందు పెట్టి  దేవుణ్ణి  ప్రార్థన చేస్తాడు.  ఒకవేళ వ్యాది గ్రస్తుడు శివునికి, శివ అవతారాలకి పూజ చేసే వారైతే రామజోగి “శివపూజ” చేసేటప్పుడు “డమరుకము” ను ఉపుతూ పూజ చేస్తాడు. ఒకవేళ “విష్ణు” అవతరాలకి పూజ చేసేవారైతే రామజోగి  “ఘంట” లు ఉపుతూ విష్ణు ఆరాధన చేస్తాడు. తరువాత వ్యాది గ్రస్తునికి చెట్ల పసరికలతో చేసిన “రామజోగి మందు” ని  ఇవ్వడం జరుగుతుంది. రామజోగి వైద్యం చేసినందుకు ప్రతిపలంగా ధన, ధాన్య, వస్త్ర, బంగారo, రూపములో “కానుక” లను, “సంభావన” లని ఇస్తారు. ఈ ప్రక్రియని సమాజములోని బయటి వ్యక్తుల చే  రామజోగి “భిక్షాటన” చేస్తున్నట్లుగా చిత్రీకరించ బడుతున్నది. కానీ రామజోగి చేసే వైద్య సేవ  చేసినందుకు కట్న కానుకలు రూపకంగా ఇచే “ప్రతిఫలం” గా వాటిని తీసుకొంటున్నారని బావిచడం లేదు. 
రామజోగి సంచార జీవనం చేస్తు “రామజోగి మందులు” అమ్ముకొనే  “సేవా కులం” మాత్రమే. మారుతున్న పరిస్థితులకి రామజోగి వైద్యానికి ఆదరణ లేకపోవడం వలన, రామజోగి చెట్ల పసరికల వైద్యం సమజములో కనుమరుగై పోవడం వలన, ఈ రామజోగి వృత్తి (చెట్ల పసరికలతో ఆయుర్వేద వృత్తి) అంతరించే దశకి చేరింది. అయినప్పటికీ కొన్ని కుటుంభాలు “వ్యవసాయ” ఆధారంగా జీవనముని కొనసాగిస్తున్నారు. 

భాష: శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) కులానికి చెందిన వారు ప్రదానంగా తెలుగు, హిందీ, మాట్లడుతారు. రామజోగుల కులానికి వారకి ఇతర ప్రత్యేక భాష ఏమి లేదు.

         శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) పుట్టుక: శ్రీ రామ నామ స్మరణతో, రామ నామ సేవతో “క్షత్రియ” వర్గ సేవికులు గా “శ్రీ క్షత్రియ రామజోగి” గా పేరు గాంచడమైనది. పూర్వము త్రేతాయుగకాలము నుండి  సాక్షాత్తు భగవత్ స్వరుపుడైన శ్రీ రాముడు మరియు వారి పూర్వికుల నుండి  శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) వారు  ప్రత్యక్ష మరియు పరోక్ష సేవలు చేయుచున్నారు. శ్రీ క్షత్రియ రామజోగి కులానికి ఈ పేరు రాముని పేరుమీద నామకరణం చేయడం జరిగింది. సంచార జీవనములో బాగంగా పురాణం ఇతిహాసాలని గేయాల  రూపకంగా కీర్తనల రూపకంగా కథల రూపకంగా సమాజానికి తెలియజేస్తూ వృత్తి పరంగా ఆయుర్వేదిక చెట్ల పసరికల ద్వార వివిధ వ్యాదులని నయం చేయడం లో సిద్ద హస్తులు. రామజోగులు ప్రదానంగా మానసికమైన  శారీరక వ్యాదులకి, మానసికమైన వ్యాదులని నయం చేస్తారు. శ్రీ క్షత్రియ రామజోగి ( రామజోగి/రామజోగుల) కులానికి చెందిన వారు ప్రదానంగా కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్,  జిల్లాల్లో జీవిస్తున్నారు.
            శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) స్తిరనివాసం: శ్రీ క్షత్రియ రామజోగి ( రామజోగి/రామజోగుల ) కులానికి చెందిన వారు ప్రదానంగా కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, జిల్లాల్లో జీవిస్తున్నారు. రామజోగి నివాసాలు ఉరికి మద్యలో కాపు, పద్మశాలి, వడ్ల, కమ్మరి, గౌడ, ఔసుల, కులాలకు చెందిన నివాస స్థలాలకి ధగరగా ఉంటాయి. రామజోగుల వారి ఇండ్లు కొన్ని సిమెంటు కంక్రిటు తో నిర్మిచినవి మరికొన్ని చిన్న చిన్న రేకుల షేడ్స్ ఉన్నాయి. మరికొందరు నివాస స్థలాలు లేక  అద్దె గదులలో ఉంటూ జీవిస్తున్నారు.
          శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) వంశ గోత్రాలు:  శ్రీ క్షత్రియ రామజోగి ( రామజోగి/రామజోగుల ) కులానికి చెందిన వారు ప్రదానంగా కొంగాళ్ళ, గుజ్జేటి, శాబోలు, గుర్రం, గోవిందు, వంటి వంశాలు ఉన్నాయి. రామజోగి వివిధ వంశాలకి చెందిన వారికి  గోత్రాలు ఉంటాయి.కొంగాళ్ళ వారి గోత్రం “యాధర్శి ఋషి” గుజ్జేటి వారి గోత్రం ”మారిచ ఋషి”  శాబోలు వారి గోత్ర్రం “గార్గేయ ఋషి”  గుర్రం వారి గోత్రం “పసునుటి ఋషి”  గోవిందు వారి గోత్రం “పౌరుష ఋషి”  గా ఉన్నాయి. వీరు ప్రదానంగా కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్  జిల్లాల జీవిస్తున్నారు                                                          'Bold text'