Jump to content

User:Pranukumar

From Wikipedia, the free encyclopedia

జీవిత లక్ష్యాన్ని సాధించాను కానీ జీవితం లో ఓడిపోయాను "

లక్ష్యం వైపుగా ప్రయాణించి వాస్తవ జీవితానికి దూరం అయ్యాను ..నేను చేసిన తప్పు మీరు ఎప్పుడు చేయకూడదు అని నా జీవితంలో నేను చేసిన పొరపాటును మీకు తెలియచేస్తున్నాను.

లక్ష్యం అనేది జీవితాన్ని దగ్గరచేయలేగాని దూరం చేయకూడదు అని తెలుసుకోవటానికి నాకు చాలసమయమే పట్టింది.తీరా తెలుసుకోనేసరికి 3 Years గడచిపోయాయి.ఇప్పుడు చేసిన తప్పుకు అనుక్షణం బాధ పడుతున్నాను.

అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలిగాను అనే ఆనందం ఒకవైపు మరియు జీవితం లో ఓడిపోయాను అనే బాధ మరోవైపు..ఇలా నా మనసులోవున్న నా ఆనందాన్ని, నా ఆవేదనను మీతో పంచుకోవాలి అనుకొంటున్నాను .

నా పేరు కుమార్ ..నేను ఏదో గొప్పగా సాధించానని నా achievement గురించి వ్రాయటంలేదు.కానీ ఇది నావరకు గొప్ప విజయంగానే భావిస్తున్నాను.

నేను డిగ్రీ లో ఫస్ట్ టైం కంప్యూటర్ ల్యాబ్ కి వెళ్ళినపుడు అక్కడ Mouse కూడా పట్టుకోవటం రాదని అందరు నన్ను చూసి నవ్వారు.నిజంగా అప్పుడు చాల బాధపడ్డాను ఆ తరువాత చాల రోజులు ల్యాబ్ కి వెళ్ళటం మానేసాను.ఒకసారి తప్పక ల్యాబ్ కి వెళ్ళవలసివచ్చింది.అప్పుడు కూడా మళ్లీ అదే అవమానం ఈసారి నా కళ్లకు నీళ్ళు వచ్చాయి.కానీ అప్పుడు బాదనుంచి నుంచి నిరాశ కలుగలేదు.. కసి పుట్టింది..ఎక్కడైతే అవమాన పడ్డానో అక్కడే నేనంటే నిరూపించుకోవాలి అనుకొన్నాను.

అంత వరకు కష్టంగా అనుకొన్న కంప్యూటర్ subject ని ఇష్టంగా చదివాను.మా ఫ్రెండ్స్ నుంచి చాల నేర్చుకొన్నాను.బయట courses Join అయ్యాను. Computer తప్ప వేరే లోకం లేనట్లుగా కష్టపడ్డాను.

" " Efforts Never Fail" "


Computer Practicals లో అందరికంటే ఎక్కువ Score చేయగలిగాను.మా Madam కుడా ఆశ్చర్య పోయారు.

ఆ తరువాత కావలి లో చేరాను.College లో ఏదో మాట మీద వచ్చి మన Pg Centre Website Create చేస్తాను అని చెప్పేసాను.అది అందరికి తెలిసిపోయింది.. కానీ నిజానికి Computer Programing ,Software Troubleshooting ,Internet మాత్రమే నేర్చుకొన్నాను.Website Design చేయటం ఎలాగో అసలు తెలియదు.Pg తరువాత Hyderabad లో SAP Join అయ్యాను.దానితో పాటే Web Design Course join అవ్వాలి అనుకొన్నాను. కానీ SAP కే సమయం సరిపోయేదికాదు.

ఎలాగో అందరు మరచిపోయారుకదాఅని నేను website గురించి పట్టించుకోలేదు.January 2008 లో SAP Complete ఐతే ఇంటికి వచ్చాను.కానీ మనసులో ఇచ్చిన మాట నిలపెట్టుకోలేకపోయాను అనే బాధ ఎక్కువ అయింది .మళ్లీ Hyderabad వెళ్లి Course నేర్చుకోవాలంటే అసాద్యం అనిపించింది. కానీ ఇష్టాన్ని చంపుకోలేక పోయాను..

అప్పుడు నా ఫ్రెండ్స్ B.tech,Msc(Comp),MCA..ఇలాగ అందరిని అడిగాను website create చేయటం ఎలాగ అని..కానీ అందరు నన్ను చూసి నవ్వేవారు.మాకే అదిచేయాలంటే రాదు website create చేయటం అంటే E.mail create చేసినట్లు కాదు.. అయిన ఒక Commerce Student వి నువ్వు చేయగలవ అనే వాళ్ళు.. నాకు వాళ్ళు సహాయం చేయకపోయిన బాధపడేవాన్ని కాదు కానీ నేను చేయలేను అనేసరికి చాల కసి కలిగించింది.

" ఇంక Website Create చేయటమే నా Life Aim అనుకొన్నాను "


అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.Internet తీసుకొంటే ఎవరితో అవసరం లేకుండా online లో నేర్చుకోవచ్చుఅనుకొన్నాను.BSNL Office చుట్టూ తిరిగి ఎలాగో Net Connection తెచ్చుకొన్నాను.8 నెలలు Day and Night కష్టపడి HTML,JAVA Script నేర్చుకొన్నాను(మొత్తం నేర్చుకోలేదు కానీ ఒక Website ని create చేసేవరకు నేర్చుకోగలిగాను). 8 Months నా career ని కూడా మరచిపోయి కష్టపడ్డాను. 8 months ఇంట్లోనే వుండి నేర్చుకొన్నాను.

నేను చదివిన చదువుకి చేసే పనికి అసలు పొంతన లేదు..మా parents ఎంత చెప్పిన వినిపించుకోలేదు.. కాదు మనసుకి ఎక్కలేదు. నా లక్ష్యం అంత నేను web design లో professional కాలనే..ఆ లక్ష్యం కొంతవరకు సాదించిన తేదీ 8th august 2008.

'Our College Website Was Officially Launched On 08-08-2008 "


నిజంగా చాల సంతోషపడ్డాను.కానీ ఒక Website Maintain చేయాలంటే HTML, Java Script మాత్రమే సరిపోవని అర్థం అయింది.ఇంక మంచి programming languages అవసరం అయ్యాయి.అవి నేర్చుకోవాలంటే ఇంక ఎక్కువ సమయం పడుతుంది.ఇప్పటికే నా విలువైన టైం ని వృదా చేసానని ఇంట్లో అందరు బాధపడేవారు.కానీ మద్యలో work ని వదిలి వెళ్ళటానికి మనసు ఒప్పుకోలేదు. ఇంక ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా మళ్లీ కొత్త courses నేర్చుకోవటం ప్రారంబించాను.CSS Designing ,DHTML,XML,Flash Work,Hacking ఇలాగ అన్ని ముక్యమైన courses నేర్చుకొన్నాను.దాదాపు వీటికికూడా 9 నెలలు పట్టింది.

website create చేసాక ఒకటి మాత్రం తెలుసుకొన్నాను. " It Is Easy To Develop Or Create Any Thing But It Is Very Difficult To Maintain As A Good Thing " అని..

"The greatest revenge is to accomplish what others say you cannot do."

అలాగే నాకు ఏది ఐతే అసాద్యం అన్నారో అది సాధించి చూపించాను..నా aim ని నేను అందుకోగలిగాను.

కానీ విలువైన సమయాన్ని వృదాచేస్తున్నాను అని మరచిపోయాను.అంతేకాక ఈ Website Create చేయటానికి నాకు దాదాపుగా Rs 40,000 /- ఖర్చు అయింది.ఇంట్లో parents పడే బాధకూడా తెలుసుకోలేక పోయాను. PG Complete అయిన 3years కి కూడా ఎందుకు మీ బాబుకి job రాలేదు అని అడిగే వారికి సమాదానం చెప్పలేక మా father ఎంత బాదపడ్డారో..అని తలచుకొంటేనే చాల బాధగావుంటుంది.

" జీవిత లక్ష్యాన్ని సాధించాను కానీ జీవితం లో ఓడిపోయాను "


లక్ష్యం అనేది జీవితాన్ని దగ్గర చేసేవిదంగా వుండాలి అని చెప్పిన మా నాన్న మాటలని పెడచెవిన పెట్టినందుకు నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను.


నేను మా parents కి మాట ఇచ్చాను కచ్చితంగా 8 నెలలలో మంచి career లో settle అవుతాను అని.. స్నేహితులారా life లో నాకంటూ ఒక Identity వచ్చేవరకు అన్నింటికీ , అందరికి దూరంగా వుండాలి అనుకొన్నాను. ఇన్ని రోజులు మీ నుంచి వచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ...

ఇక మీనుంచి సెలవు తీసుకొంటున్నాను....


                          ----మీ కుమార్ ---


www.pgckavali.in