User:Dattu Satyanarayana
సోనమ్ మాలిక్*
హర్యానాలో సోనిపాట్ కి చెందిన సోనమ్ మాలిక్(జననం ఏప్రిల్ 15 , 2002 )భారత మహిళా కుస్తీ క్రీడాకారిని.జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా ప్రపంచ కెడేట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుంది.తన సహదేశస్తురాలు , 2016 రియో ఒలింపిక్స్ రజత పతాక విజేత సాక్షి మాలిక్ ను సైతం ఓడించింది సోనమ్ .[1]
◆వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం
హర్యానా లో సోనిపాట్ దగ్గర మాడిన గ్రామం లో 2002 ఏప్రిల్ 15 న జన్మించింది.సోనమ్ కుస్తీ పోటీలకు ఎక్కువ ప్రధాన్యతనిచ్చే ప్రాంతానికి చెందిన వ్యక్తి. [1]కుస్తీ క్రీడారంగం వైపు ఎక్కువ ప్రభావితమవటానికి కారణం ఇద్దరు రెజ్లర్లు తండ్రి , సోదరుడు.చిన్న వయసు లోనే తన తండ్రి అజ్మీర్ మాలిక్ శిక్షణలో తమ సొంతూర్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చేర్పించాడు.కనీస వసతులు కూడా ఉండేవి కావు నేలపై పరిచే చాపలు కూడా లేకపోవడంతో నేరుగా నేలపైనే సాధనలు చేసేవాళ్ళం కానీ వర్షాకాలంలో నేల మొత్తం బురద అయిపోయేది దాంతో మమ్మల్ని బలవంతంగా రోడ్లపై సాధన చేయించేవారు.కనీస వసతులు లేనప్పటికీ శిక్షణ మాత్రం చాలా బాగుండేది.[1]
2017 పోటీల్లో ఆడుతుండగా తగిలిన గాయం తన బంగారు భవిష్యత్తు గాడి తప్పేలా చేస్తుందేమో అని భయపెట్టింది.దాదాపు నెలన్నర పాటు కొనసాగిన చికిత్స సమయం లో తన తండ్రి ఇటువంటి సంఘటల్ని ఎదుర్కొన్న ఇతర ఆటగాళ్ల గురించి , వాళ్ళు వీటి నుంచి ఎలా కొలుకున్నారో లాంటి విషయాల్ని చెబుతూ తనలో ఆత్మస్తేర్యాన్ని నింపారు.ఎంతో కఠోర శ్రమ తర్వాత ఆమె తిరిగి కోలుకుని మళ్ళీ తన విజయాల పరంపర కొనసాగించింది.[2]ఆడటంతో పాటు ఆర్ట్స్ లో తన ఉన్నత విద్యనభ్యసిస్తుంది.[3]
◆వృత్తిపరమైన జీవనం
2016 లో జరిగిన జాతీయ పాఠశాల క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో అందరి దృష్టినాకర్షిoచింది సోనమ్ .తర్వాత సంవత్సరం తన జీవితంలో ఎంతో మర్చిపోలేని సంవత్సరం ఎందుకంటే అదే ఏడాది కెడేట్ ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ తో పాటు కెడేట్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ను స్వర్ణ పతకంతో ముగించింది.2018 లో జరిగిన కెడేట్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మరియు కెడేట్ ఆసియన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో రజత పతకాలు గెలుచుకుంది.2019 లో జరిగిన కెడేట్ వరల్డ్ రెజ్లింగ్ లో తిరిగి స్వర్ణ పతకం గెలుచుకుంది.[3]
తన జీవితంలో అతి ముఖ్యమైన క్షణాలు 2020 లో సాక్షి మాలిక్ 2016 ఒలింపిక్స్ రజత విజేత ను రెండు నెలల గడువులో రెండు సార్లు ఓడించడంతో వచ్చాయి.మొదటి విజయం జనవరిలో జరిగిన ఆసియన్ ఛాంపియన్షిప్ ప్రయత్నాలలో ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగిన ఒలింపిక్స్ అర్హుల ఎంపిక లో రెండో విజయం దక్కింది.[4][5]
కుస్తీ పతకాలు,ప్రణాళికలు గురించి వింటూ పెరిగిన సోనమ్ మాలిక్ ఒలింపిక్స్ లో ఎలాగైన పతకం గెలవాలి అని లక్ష్యంగా పెట్టుకుంది.భారతీయ క్రీదాకారులకు ఒలింపిక్ పతకాలు సాధించేలా సహాయం అందించే ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్(OGQ) సంస్థే సోనమ్ కు కూడా సహాయం అందించింది.[6]
- ^ a b c "BBC".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ^ "Olympicchannel".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ^ a b "Wrestlingtv".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ^ "Times of india".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ^ %5b5 "The hindu".
{{cite web}}
: Check|url=
value (help)CS1 maint: url-status (link) - ^ "The bridge wrestling".
{{cite web}}
: CS1 maint: url-status (link)