User:Brundavanam
ముస్లిమేతరుల హక్కులు మరియు ఇస్లాం మనం సమాజంలోనే నివసిస్తున్నాము. మన జీవితాలు మన ప్రమేయం లేకూండా అనేక మంది జీవి తాలతో ముడిపడి ఉన్నాయి. అది మనకు ఇష్టమయినా, కష్టమయినా, ప్రత్యక్షంగానయినా, పరోక్షంగాన యినా మనమందరం ఒకే నేలన పండిన ఆహారాన్ని భుజిస్తాము. ఒకే సెలయేటి నీటిని త్రాగుతాము. ఒకే వాతావరణంలో గాలిని పీల్చుకుంటాము. అంటే మనిషి సంఘజీవి అన్న మాట. మనిషి సంఘజీవి అన్న మాట ఎంత నిజమో 'మనిషి తనకు తెలియనిదానికి శత్రువు' అన్న మాట కూడా అంతే నిజం. మనమందరం మన సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ మన ఇరుగుపొరుగువారి ఆలోచనలు ఎలా సాగుతున్నాయో, వారి ఆచరణలకు ముఖ్యమయిన మూలాధారాలేవో కొంత వరకయినా తెలుసుకోవ డం ఎంతయినా అవసరం. దాని వల్ల మరేమీ కాకపోయినా మన చుట్టుప్రక్కల వాతావరణంలో సాను కూలతను, సహిష్ణుతను, సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోణంలో చూస్తే 'ఇతరుల మతం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతే మంచిదేమో' అనుకునే మనలోని ప్రతి వ్యక్తి ప్రపంచంలోని అన్ని మతాలను వాటి సర యిన రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నించడం విశ్వ శాంతి కోసం మార్గం సుగమం చేెసుకోవడమే అవుతుంది. తద్వార పరస్పర అవగాహనకు, మనకు దగ్గరగా, దూరంగా ఉన్న పరిసరాలను ఉత్తమ రీతి లో తెలుసుకోవడానికి, పరస్పరం ఒండొకరిని అర్థం చేసుకొని మసలుకొనే మార్గమేర్పడుతుంది. అప్పుడు అస్పష్టత స్థానంలో, స్పష్టత, అపార్థం స్థానంలో అర్థం చేెసుకునే తత్వం అలవడి, వారిధులపై వారధులు వెలిసి, అపోహల పొరలు తొలగి, గోడలకి బదులు ఒండొకరి మనసును చేరుకునే వంతెనలు నిర్మితమవుతాయి. అదే మన పుట్టుక పరమార్థం కూడాను. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము అని అంటోంది ఖుర్‌ఆన్. (49:13)
ఇస్లాం రూపంలో ఏ కారుణ్య మేఘాలను అల్లాహ్‌ా మానవాళికి అందించాడో అది - ముస్లిములనీ, మస్లిమేతరులనీ, ఆస్తికులనీ, నాస్తికులనీ, అస్పృశ్యులనీ, అత్యున్నతులనీ తేడా చూపక అందరికి తన కారుణ్య ఒడిలో సేద తీరే అవకాశం ఇస్తుంది. సామాజిక, రాజకీయ, గృహ హింసని, దౌర్జన్యాన్ని రూపు మాపి అహింసను, ప్రశాంతతను, న్యాయాన్ని సమపాళ్ళలో అటు స్త్రీలకు ఇటు పురుషులకు అందిస్తుం ది. మానవులందరూ ఒకే దేవుని దాసులు, ఒకే మానవ జంట నుండి ఉనికిలోకి వచ్చినవారుగా పరస్ప రం సోదరులని, వారు ఒండొకరి పట్ల ప్రేమ భావం, త్యాగ భావం కలిగి ఉండాలని బోధిస్తుంది. 'ఎవరు కరుణించరో వారు కరుణించబడర'ని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కరుణను మానవుల వరకే పరి మితం చేయక సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల సాత్విక ప్రేమ కలిగి ఉండాలని మరీ మరీ ఉద్ఘాటిస్తుంది. 'తన కోసం దేన్నయితే ఇష్టపడతామో దాన్నే తన తోటి సోదరుని కోసం సయితం ఇష్టపడనంత వరకు దైవ ప్రేమకు పాత్రులం కాలేమ'ని హితవు పలుకుతుంది. ఇరుగుననున్న వారు - వీరా, వారా అన్న తేడా లే కుండా 'పొరుగుననున్న వారు పస్తులుండగా తాను మాత్రం కడుపార భోంజేసినవాడు విశ్వాసి కాజా లడ'ని హెచ్చరిస్తుంది. 'ఎవరి హింస నుండి పొరుగువారు సురక్షితంగా ఉండరో అతను మోమిన్ కాద' ని తీర్మానిస్తుంది. అది చెప్పిన ప్రతిదాన్నీ నూటికి నూరుపాళ్ల్లు మహా ప్రవక్త ముహమ్మద్ (స) వారు బ్రతి కుండగానే పాటించి చూపడమే కాక, అటువంటి ఓ సువ్యవస్థను, సత్సమాజాన్ని స్థాపించి మరీ వెళ్ళారు. ఇక ఇస్లాంలో ముస్లిమేతరుల హక్కుల గురించి ప్రస్తావిమచుకున్నట్లయితే -
ఒక వేళ మనకు ముస్లిమేతర బంధువులుండి వారితో మనం ఎలా వ్యవహరించాలన్న సందేహం కలి గితే నాకు కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు...ఒకవేళ నీవు ఎరుగని వారి నెవరినయినా నాకు భాగ్యస్వామిగా చేర్చు అని వారు నిన్ను ఒత్తిడి చేస్తే మాత్రం వారి మాట వినకు. వారితో ప్రపంచంలో ఉన్నంత వరకు ఉత్తమ రీతీలో వ్యవహరించు. (దివ్యఖుర్‌ఆన్- 31: 15) అంటూ మీ ఆ సంశయాన్ని దూరం చేస్తుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు జీవితపు అన్ని రంగాల్లోనూ ఆది మార్గదర్శకత్వం వహిస్తుంది.
స్వయంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) రోగగ్రస్థుడయిన యూద బాలుడ్ని పరామర్శించడానికి వెళ్ళారు. పరమ కపటి అయిన అబ్దుల్లాహ్‌ా బిన్ ఉబై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అతని కుమారుడు తన నాన్నపై కప్పడానికి ప్రవక్త (స) వారి కంబలి అడిగితే ఇచ్చారు. మనిషి మనిషిగా చూడాలన్న విష యాన్ననుసరించి ఒక యూదుని శవం పోతుండగా లేచి నిలబడ్డారు. కొందరు సందేహం వెలిబుచ్చగా 'తనూ మనిషే కదా' అని వారి నోళ్లు మూయించారు. యూదులు -'అ్సలాము అలైకుమ్'-మీపై శాంతి కురియుగాక! అనడానికి బదులు 'అస్సాము అలైకుమ్'-మీకు చావు మూడుగాక! అని శపించినా ప్రవక్త (స) వారి మన్నించారు. విషం పెట్టి చంపాలని ప్రయత్నించిన మరో యూద మహిళను ఆయన క్షమిం చారు. � బీదలకు, అవసరార్థులకు సహాయం చేసే విషయంలో ఇస్లాం ముస్లిమేతరులను ఉపేక్షించలేదు. దివ్యఖుర్‌ఆన్ మరియు హదీసు గ్రంథాలలో ఖైదీల పట్ల ఉత్తమంగా వ్యవహరించడి అని బోధించబడింది. ఆ ఖైదీలు అధిక శాతం ముస్లిమేతరులే అయి ఉండేవారు. స్వయంగా మహా ప్రవక్త (స) ఏదయినా మంచి వంటకం, కూర వంటివి ఇంట్లో చేస్తే మొదట పొరుగున ఉన్న ముస్లిమేతరుల ఇళ్లకు పంపేవారు. వారికి ఆర్థిక అవసరం ఏమ యినా ఉంటే తాను ముందుండి వారి అవసరాన్ని తీర్చేవారు. వేళ విశేషాన్ని బట్టి వారికి కానుకలు కూడా పంపేవారు. రోజూ అక్కసుతో తన మీద చెత్త చెదారం పోసే ఓ మహిళ మంచాన పడితే ముందు తానే వెళ్ళి పరామర్శించారు. ఈ సంఘటనల దృష్ట్యా ముస్లిమేతర సోదరులకు సద్ఖతుల్ ఫిత్ర్ సయితం ముస్లిమేతర సోద రులకు ఇవ్వవచ్చని, ఖుర్బానీ మాంసాన్ని కూడా వారికి పంచి పెట్టవచ్చు అని అభిప్రాయపడ్డారు. కొందరు ధర్మవేత్తలు. అలాగే అవసరార్థం ముస్లిమేతర సోదరులకు ప్రభుత్వ ఖజానా నుండి సహాయం అందించి దాఖ లాలు కూడా కోకొల్లలు.
కయ్యానికి కాలు దువ్వని, యుద్ధం చేయని ముస్లిమేతరుల ప్రాణం, మానం, ధనం ఇస్లాం దృష్టిలో ముస్లింల ప్రాణం, మానం, ధనం వంటిదే. ఏ ముస్లిమేతర సోదరుడయితే తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో నేను అతని వాగ్దానాన్ని గౌరవిస్తాను అని మహా ప్రవక్త ముహమ్మద్ (స) చెప్పడమే కాక, ఒక ముస్లిం వ్యక్తి ఒక 'జిమ్మీ' - ఇస్లామీయ పరిపాలనా పరిధిలో నివసించే ముస్లిమేతర సోదరుడ్ని హత్య చేస్తే అటువంటి ముస్లిం స్వర్గపు సువాసన కూడా ఆఘ్రాణించ లేడు అని హెచ్చరించాడు. ఆయన కక్షను, వివక్షను పాటించలేదు. ముస్లిం - ముస్లిమేతరుని ప్రాణాలు సమానమయినవి ప్రకటించారు. అంతే కాదు, ఒక స్వతంత్య్ర ముస్లిం రక్తానికి బదు లుగా ఎంత పరిహారం చెల్లించబడుతుందో అంతే రక్త పరిహారం ఒక ముస్లిమేతరునికి కూడా చెల్లించబడుతుం ది అని నిర్ణయించారు. ఒక ముస్లిం సొమ్మును దొంగలిస్తే ఏ శిక్ష పడుతుందో, ఒక ముస్లిమేతరుని ఆస్తిని దొం గలిస్తే కూడా అదే శిక్ష పడుతుంది. ఒక ముస్లిం నుండి తీసుకోబడిన బాకీని చెల్లించని పక్షంలో ఏ విధమ యినటువంటి చర్యలు తీసుకోబడతాయో అలాంటి చర్యలే ఒక ముస్లిమేరుని అప్పుని తీర్చని పక్షంలో సయితం తీసుకోబడతాయి. ఇదే పరంపర నలుగురు ధర్మ ఖలీఫాల కాలంలో సయితం అమలు పర్చబడింది. సారాయి, నిషిద్ధ జంతువుల మాంసం ఒక ముస్లిం దగ్గర ఉండి మరో ముస్లిం వాటిని పారేసినట్లయితే దానికి ఎలాంటి నిందారోపణ ఆ వ్యక్తిపై ఉండదు. కానీ అదే అవి మరో మతంలో ధర్మసమ్మతంగా పరగణించబడి, ఒక ముస్లి మేతర సోదరుని వద్ద ఆ వస్తులు ఉండగా ఒక ముస్లిం వాటిని వృధా చేసినట్లయితే వాటి ధర ఆ ముస్లిం చెల్లించాల్సి ఉంటుంది.
ఒక మతంగానీ, మత అవలంబీకులుగానీ-ఇతర మతావలంబీకుల పట్ల సమరస భావం కలిగి ఉండటం, వాటిని గౌరవిమచడం అనేది ప్రధానమయిన అంశం. ధర్మంలో ఎలాంటి బలవంతం, బలాత్కారం లేదుఅని సైద్ధాంతిక పరంగా బలమయిన పునాదుల మీద ప్రతిపాదించిన తొలి ధర్మం ఇస్లాం మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహా ప్రవక్త ముహమ్మద్ (స) మదీనా వచ్చిన తర్వాత చేసుకున్న ఒప్పందం ప్రకా రం, ప్రతి ఒక్కరూ వారి మతం ప్రకారం నడుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటారన్నది ప్రధానాంశం. ఇతర జాతులు, తెగలు, సముదాయాలు ఆరాధించే దైవాల గురించి చెడుగా ప్రస్తావించడాన్ని ఖుర్‌ఆన్ బహి రంగంగా వారించింది. అంతేక కాదు, ప్రతి జాతిలోనూ తన ప్రవక్తలను అల్లాహ్‌ా పంపినట్లు ఖుర్‌ఆన్ ప్రకటిం చింది. కాబట్టి, ఇతర మార్గదర్శకుల, ప్రవక్తల, సంఘ సంస్కర్తల పట్ల గౌరవభావంతో మెలగాలనీ, వారి విష యంలో తమ నోటిని, ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలనీ అది నొక్కి వక్కాణిస్తోంది. అలా ప్రజల చేత పూజలందుకుంటున్న వారు దైవప్రియులు, దైవప్రవక్తలు అయి ఉండవచ్చు అని కూడా తెలియజేస్తుంది. అలాగే ఇస్లామీయ పరిపాలనా సమాజంలో మైనారిటీల పర్సనల్‌లాకు అన్ని విధాల మద్దతు, రక్షణ ఉంటుంది.
ఇదే విధమయినటువంటి ఔదార్యాన్నే ఇస్లాం ముస్లిమేతరుల ప్రార్థనాలయాల విషయంలో సయితం కనబరు స్తుంది. మామూలు సమయంలోనే కాక, యుద్ధ సమయాల్లో సయితం ముసిలమేతరుల ఆరాధనాలయాలను గానీ, చర్చీలనుగానీ, అగ్నిపూజారుల మందిరాలనుగానీ కూల్చరాదని స్వయంగా ప్రవక్త (స) వారు ఆదేశించడ మేకాక, అటువంటి ఒక క్రైస్తవ బృందం మదీనా రాగా, వారిని మస్జిదె నబవీలో నివసింపజేయడమేకాక, వారు అక్కడ వారి పద్ధతిలో ప్రార్థన చేసుకునే సౌకర్యాన్ని కూడా కలుగజేశారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) వారి ఈ బోధనల, తర్వాతి కాలపు ధర్మఖలీఫాల ఆదర్శాల వెలుగులో ఇస్లామీయ ఫిఖహ్‌ావేత్తలు ముస్లిమేత రుల పట్ల సమరస భావం, సోదరభావం సహనం కలిగి ఉండాలని, మత స్వేచ్ఛ ప్రతి వ్యక్తి జన్మ హక్కని తీర్మా నించడమే కాక, ముస్లిమేతర సోదరుని నుండి అన్యాయంగా కాజేయబడిన భూమిపై నమాజు చేెయడంగానీ, మస్జిదు నిర్మించడంగానీ అధర్మం అని ఖరారు చేశారు.