Jump to content

Devaragutta Dasara festival

From Wikipedia, the free encyclopedia

శ్రీ మాళ,మల్లేశ్వర స్వామి యొక్క బన్ని ఉత్సవం

క్షేత్ర చరిత్రాత్మక నేపధ్యం:

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా, ఆలూరు తాలుకా, హోళగుంద మండలం, దేవరగట్టు (మునుపట మత్యాస్సాద్రి అను) గ్రామాం లో స్వయంభువ కూర్మావతారంలో వెలసిన శ్రీ మాళ,మల్లేశ్వర స్వామి యొక్క బన్ని ఉత్సవం త్రేతాయుగం నుండి జరుపుకుంటున్న దసరా దశమి సంబరం. పూర్వం మనికాసుర, మాల్లాసుర అనే రాక్షసులు మనుషుల, పశువుల జీవనానికి భంగం కలిగిస్తూ హింసించేవారని, రాక్షస బాధలనుండి కాపాడమని అక్కడ ప్రజాలు, రుషులు, మునులు పరమేశ్వరుని శరణు వేడగా, అనుగ్రహించి పార్వతీ,పరమేశ్వరులు రాక్షస సంహారం చేస్తారు. ఇక్కడ మాళమ్మ పార్వతీదేవిగా, మల్లేశ్వర పరమేశ్వర స్వాములుగా, తుప్పధ మాళమ్మ గంగాదేవిగా వెలసి దర్శనమిస్తారు. సుమారు ఎనిమిదివందలు  అడుగుల ఎత్తులో, నాలుగువందలు  మెట్లు కలిగిన కొండపై కొలుపైనందున స్వాములవారిని గిరిమల్లయ్య, గట్టుమల్లయ్య అనికూడా పిలుస్తారు.

బన్ని ఉత్సవం -  విశేషాలు :-

అనాది నుండి ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన లోకకల్యాణంగా భావించి  కొలిచె స్వాములవారి కల్యాణ మహోత్సవమును బన్ని ఉత్సవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో చుట్టుప్రక్కల యాభై కి పైగా గ్రామాల ప్రజలు పాల్గొంటారు మరియు వేడుకను తిలకించేందుకు తెలుగురాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుండి లక్షలాది భక్తులుతండోపతండాలుగా తరలివస్తారు. పండుగకు ఐదు రోజులముందు గణపతిపూజ, గట్టు ఆదిదంపతుల కంకణధారణ(నిచ్చితార్థం) వంటి శుభసంకల్ప సుమంగళకార్యలను శ్రీకారంగావించి, అర్ధరాత్రి విజయదశమినాడు డొల్లబండ దగ్గర వసుదైకకుటుంబముగా కలసిమెలసి పండుగను జరుపుకుంటామని పాల-ప్రమాణం చేసుకోని గట్టుపైకి వెళ్లి, మాలమల్లేశ్వరస్వామి యొక్క మాంగళ్యధారణ, కల్యాణమహోస్తవనాంతరం, ఉత్సవమూర్తులను పల్లకిలో, దేవతా విగ్రహాలను అశ్వవాహనాలతో భక్తుల యొక్క తలపై మోసుకొని, చేతో కర్రలతో, దివిటీలను ధరించి, కాగడాల వెలుగులో  డోలు భాజాలు, తాళాలు, తప్పెటలు, డమరుకాల శబ్దాలతో, పిల్లనగ్రోవుల సంగీతంతో గొరవయ్యలు, పూజపండితులు, భక్తులు బన్ని మహొత్సవంగా బహుపరాక్ అంటూ బండారు(పసుపు) ను దేవుళ్లపై గుప్పిస్తు, నుధుటి పై రాసుకుని అనంతమైన ఆనందహేలతో ఉరకలువేస్తు ఒళ్లు గగుర్పాటు చెంది రోమాలు నిక్కపొడుచుకునే సమ్మోహన జైత్రయాత్రగా మొదలై సుమరు ఆరు  కి.మీ వరకు ముళ్లబండ, పాదాలగట్టు పూజలు అందుకొని, రక్షపడి దగ్గర పూజారియొక్క మొకాలి వెనుకబాగంక్రింద నుండి పదహారుమూరుల చిన్నపాటి త్రాడును డబ్బునసహాయంతో లాగి ఐదు చుక్కల రక్తంను రాక్షసులకు చివరికోరిక తర్పణంగా సమర్పించి, తధుపరి సమీవృక్షం వద్ద పూజలు నిర్వహించి, వేకువజామునైయేసరికి  నేరుగా ఎదురు బసవన్న గుడి చేరుకుని దైవకార్ణీకం (భవిష్యవాణి) వినిపిస్తారు, ఇక్కడ భవిష్యవాణి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తదనాంతరం భక్తాజనసమూహ కోలాహలంతో సింహసనకట్టకు చేరడంతో బన్ని భక్తుల చేతి చప్పట్లతో జయప్రదంగావిస్తుంది. మరుసటి రోజు స్వాములవారి రధోత్సవము, వసంతోస్తవం, గొరవయ్య ఆటలు, పాలుత్రాగుట, గొలుసుతెంపే మొదలగు విన్నుత సంప్రదాయం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపబడతాయీ. దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ పండుగను భక్తులు పరమపవిత్రనిష్టతో, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. గట్టు పరిసరప్రాంతాలలో ఉంటే కొండకోనలు, కొలనులు, చెరువులు పర్వతగుహా, రాజులకోట మరియు ఏనుగుల భావి, కొత్తకోట భావి మొ||వాటిని మనం చూడవచ్చు.

ఇంతటి మహిమ, మహత్యం కలిగిన ఈ బన్నీ పండుగను సకలజనుల భక్తులు యొక్క కోరినకోర్కెలు తీర్చే కామదేను కల్పతరువుగా భావించి, జీవితంలో ఉల్లాసాన్ని, సంతోషాన్ని సుభిక్షాని మరియు సిరిసంపదలను ప్రసాదించే దివ్య అఖండ శక్తిగా తలచి, కొలిచి, తరించి ధన్యులవుతారు.

జై మల్లేశ్వరా,, జై జై మాళ,మల్లేశ్వరా ,,


సంపాదకీయ-మూలం:

నా వద్దనున్న, పరిశోదన ద్వారా గడించిన సమాచారం మరియు పూర్వపుట్టోతరాలనుభవ పూర్వీకులు అందించిన జ్ఞానసముర్పాజన మేరకు మాత్రమే ఈ విషయ పరిజ్ఞానం అని గమనించి, ఈ నా చిన్న పాటి ప్రయత్నంలో ఏవైనా తప్పులు వుంటే గుర్తించి, మన్నించి వాటిని సవరించి ప్రామాణికతను పెంపొందించి లోకానికి అందిస్తారని ఆకాంక్షిస్తూ, ఆ మాళమల్లేశ్వరస్వామి అశేష,విశిష్టతను గురించి అందరితో పంచుకోనే భాగ్యం కల్పించినందుకు స్వాములవారికి నా యొక్క అనంతకోటీ పాదాభివందనములు.

Devaragutta Dasara festival is a festival celebrated during Hindu festival, Dasara in Devaragutta in Kurnool, Andhra Pradesh, India.[1] It is a violent form of celebration where people from three villages fight with long bamboo sticks. Many devotees who participate in the fight get injured.[2]

References

[edit]
  1. ^ "Weird festivals in Kurnool villages". The New Indian Express. 16 May 2010. Retrieved 27 October 2018.
  2. ^ "Seventy injured in annual bloody sport in Andhra". Yahoo News India. 7 October 2011. Archived from the original on 20 October 2013. Retrieved 13 January 2021.